హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

JN: జిల్లాలో VB-GRAMG కింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్, కమ్యూనిటీ సోక్‌పిట్స్ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. పనుల్లో పారదర్శకత పాటిస్తూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. గ్రామాలు, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.