హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ కోతలతో రైతన్నలు ఆందోళన

MDK: ఎల్‌నినో ప్రభావం, అప్రకటిత కరెంట్ కోతలతో జిల్లా రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ విద్యుత్ ఇవ్వకపోవడంతో బోర్లు నడవక శివ్వంపేట, చేగుంట, నర్సాపూర్ తదితర మండలాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో కోతలున్నాయని, పెట్టుబడులు పెరిగిన వేళ ఈ కష్టాలు తమను కుంగదీస్తున్నాయని రైతులు వాపోతున్నారు.