GDWL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, టీజీ మోడల్ స్కూళ్లలో ఈనెల 19న పేరెంట్–టీచర్ సమావేశాలు నిర్వహించనున్నారు. ‘తల్లిదండ్రుల భాగస్వామ్యం – ప్రతి బిడ్డ అభ్యసనానికి శక్తి’ థీమ్‌తో సమావేశాలు జరగనున్నట్లు DEO విజయలక్ష్మి తెలిపారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లల అభ్యసనంపై ఉపాధ్యాయులతో చర్చించాలని సూచించారు.
తెలంగాణ
రేపు పేరెంట్, టీచర్ సమావేశాలు: DEO


