హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సుభాష్ నగర్ లో గణేష్ ఎదుట సినిమా ప్రదర్శన

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సుభాష్‌నగర్‌లోని హిందూ వాహిని గణేశ్ మండల్ మండపంలో గురువారం రాత్రి ప్రొజెక్టర్ ద్వారా ‘నరసింహ’ సినిమాను ప్రదర్శించారు. చిన్నారులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సినిమా వీక్షించారు. మండపం వద్ద సందడి నెలకొంది.