హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా

KMM: ఈ నెల 19న జరగాల్సిన వైరా పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18, 19 తేదీలలో హైదరాబాద్‌లో అధికారులకు శిక్షణా కార్యక్రమం ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.