KMM: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సురేశ్ గౌడ్ తెలిపారు. ప్లాట్‌ఫామ్-1 పార్కింగ్ ప్రాంతంలో ఒడిశాకు చెందిన గజేంద్రనాయక్ వద్ద రూ.3.55 లక్షల విలువైన గంజాయి లభించిందని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఖమ్మం రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత


