BDK: చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయక 34 మంది విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులకు రూ.30 వేలు ఖర్చవుతుందని మెకానిక్ తెలిపినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రస్తుతం దాతల సహకారంతో శుద్ధి చేసిన నీటిని బయట నుంచి తీసుకొచ్చి అందిస్తున్నారు. ప్లాంట్‌ను వెంటనే బాగు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆర్ఓ ప్లాంట్ పనిచేయక విద్యార్థుల అవస్థలు


