హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో ఉచిత ధ్యాన–యోగ తరగతులు

MLG: ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ సత్యసాయి ధ్యాన మందిరం ఆధ్వర్యంలో 9 రోజుల ఉచిత వ్యక్తిత్వ వికాస, ధ్యాన–యోగ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19న శనివారం సాయంత్రం 6 గంటలకు పరిచయ కార్యక్రమంతో శిక్షణ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. సెయింట్ ఆంథోని స్కూల్ ప్రాంగణంలోని రామాలయం సమీపంలో తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.