హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రక్తదాన శిబిరం

SRCL: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సహా పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. 76వ జన్మదినం సందర్భంగా 76 మందితో రక్తదానం చేయించినట్లు గోపి తెలిపారు.