హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజేలకు అనుమతి లేదు: డీసీపీ

RR: వినాయక వేడుకలను శాంతియుత వాతావరణం, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, శాంతికమిటీల సభ్యులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావీయొద్దని సూచించారు. ర్యాలీలు, శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, డీజేలు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు.