WGL: భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పాలతో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు


