GDWL: మానవపాడు మండలం అమరవాయిలో వినాయకుడి నిమజ్జనం ప్రత్యేకంగా జరిగింది. శ్రీ కుంబేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడిని కరిగించేందుకు భక్తులు ఇళ్ల నుంచి నీటి బిందెలు మోసుకొచ్చారు. ఆలయం వద్దే ఆ నీటితో స్వామివారిని కరిగించి నిమజ్జనం పూర్తి చేశారు. పర్యావరణహితంగా సాగిన ఈ వేడుకలో భక్తుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ
VIDEO: బిందెల నీటితో వినాయకుడి నిమజ్జనం


