హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగునీటితో ఇబ్బందులు.. గ్రామస్థుల ఆందోళన

JN: చిల్పూర్ మండల కేంద్రంలోని క్రిష్టాజిగూడెం 3, 4 వార్డుల్లో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో అవస్థలు పడుతున్నామని, సమస్యను సర్పంచ్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని గురువారం కాలనీవాసులు తెలిపారు. వెంటనే డ్రైనేజీలు శుభ్రం చేయాలని, ఇంకుడు గుంతలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.