హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

JN: బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్‌లో విద్యుదాఘాతంతో నాచగోని అజయ్‌కుమార్ (27) గురువారం మృతి చెందాడు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అజయ్‌కుమార్ రైతు పొలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.