హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు మిల్లర్ల వినతి

KMR: తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నిజాంసాగర్ మండల మిల్లర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తహసీల్దార్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ధాన్యం సేకరణ జాప్యంతో తరుగుదల, గోదాముల కొరత, క్వాలిటీ లేని ధాన్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే సీఎంఆర్ గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవలన్నారు.