హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల పాఠశాలను పరిశీలించిన కలెక్టర్

SDPT: దుబ్బాక మండలం రామక్కపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజన తయారీలో శుచి, శుభ్రతను పాటించాలన్నారు. విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు.