హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పామర్రులో ప్రత్యేక PGRS: కలెక్టర్

కృష్ణా: పామర్రులో శుక్రవారం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు అధికారులకు అందజేయాలని సూచించారు.