ప్రకాశం: మర్రిపూడి మండలం తంగెళ్లలో గురువారం కొండపి మండలం వెన్నూరు గ్రామానికి చెందిన ఎడ్లూరు కోటయ్య అనే వ్యక్తిపై పిడుగుపడి మృతి చెందాడు. కోటయ్య తంగెల్లలో నివాసం ఉంటూ మేకలు మేపుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదం సంభవించినట్లు VRO సందీప్ తెలిపారు. కోటయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపడి వ్యక్తి దుర్మరణం


