W.G: జిల్లాలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో ఆరోగ్యశాఖ సిబ్బందితో సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ మేరకు అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లోని 3,49,301 మంది పిల్లలకు వయసుల వారీగా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
25న నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ: కలెక్టర్


