హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంబోదర లడ్డుకు భారీ ధర

NLR: మాగుంట లేఔట్ లంబోదర సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి లడ్డు వేలం వేశారు. చాలామంది పోటీ పడగా చివరికి ఎస్పీ హోమ్ జోన్ అధినేత సుబ్బనా చారి రూ. 13.55 లక్షలకు ఆ లడ్డును దక్కించుకున్నారు. హీరో శ్రీ విష్ణు, నటుడు సుదర్శన్ చేతుల మీదగా ఆయనకు లడ్డును అందజేశారు. నేడు నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నారు.