హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి లడ్డూను దక్కించుకున్న క్రిస్టియన్ సోదరులు

KDP: ముద్దనూరులోని 4 రోడ్ల కూడలి వద్ద శ్రీ శ్రీ వరసిద్ధి బాల వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో క్రిస్టియన్ సోదరులైన తిరువీధి శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రూ.20,116కు లడ్డూను దక్కించుకున్నారు. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటిన ఈ ఘటనకు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.