NGKL: లింగాల మండలం సూరాపూర్ శివారులో వానకాలం పంటల డిజిటల్ క్రాప్ సర్వే వేగంగా సాగుతోందని AEO భరత్ తెలిపారు. ఇప్పటికే మాడాపూర్, మగ్దుంపూర్ గ్రామాల్లో సర్వే దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం సూరాపూర్‌లో నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న వాలంటీర్‌కు AEO భరత్ పలు సూచనలు చేశారు. రైతులందరూ కచ్చితంగా పంట నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ముమ్మరంగా సాగుతున్న పంటల నమోదు


