అల్లూరి కలెక్టర్ నిశాంతి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సు అంశాలపై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురోగతి తక్కువగా ఉన్న అంశాలపై శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి, గడువులోగా పూర్తి చేయాలన్నారు. పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్, గిరిజన జీవనోపాధులు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపుపై చర్చించారు. శాఖల సమన్వయంతో పనులు వేగవంతంచేసి సత్ఫలితాలు సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పనులను వేగవంతం చేయాలి'


