కృష్ణా: గొల్లపూడిలోని తన కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నలుగురు బాధితులకు రూ. 4,50,715 విలువైన ఆర్థిక సహాయం అందించారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా'


