ASR: వరి పొలాల్లో నత్రజని ఎరువులను అధికంగా వినియోగిస్తే చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉందని కొయ్యూరు ఏవో శివరామ ప్రసాద్ తెలిపారు. సింగవరంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఆకుముడత, కాండం తొలిచే పురుగుల నివారణకు ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలంగట్లపై కలుపు తొలగించి, కీటకాల ఉధృతిని తగ్గించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అధిక మోతాదుతో చీడపీడల ముప్పు'


