హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలపల్లిలో రైతు సమస్యలపై వినతి

అన్నమయ్య: చిట్వేల్ మండలం మైలపల్లి గ్రామ సచివాలయంలో రైతు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం గురువారం సమర్పించారు. ఒక నెల- ఒక గ్రామం కార్యక్రమంలో భాగంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పందికాళ్ల మణి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.