హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్

అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 80వ వార్డు పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. అందులో భాగంగా ఆయన రాజుపాలెం, గొర్లివానిపాలెం, వల్లూరు, ఎరుకువానిపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.