హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభం

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు డ్రాయింగ్ పోటీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఈవో సంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.