హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందికొట్కూరులో పర్యటించిన ఎంపీ

NDL: నందికొట్కూరు పట్టణంలో గురువారం ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని బసిరెడ్డి డిగ్రీ కాలేజీలో యువత భవితకు భరోసా అనే కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యువత అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు.