హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో ఆకస్మిక తనిఖీలు..!

 ELR: చేబ్రోలులో అంగన్‌వాడి కేంద్రం కోడ్ నెం. 192 ను మహిళా శిశు సంక్షేమ శాఖ ఏలూరు జోన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి. సుజాతారాణి గురువారం సందర్శించారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ- స్కూల్ కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ, కేంద్ర నిర్వహణ తీరును పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.