హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళంపల్లిలో ఉచిత వైద్య సేవలు..!

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో సుదూర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సుమారు 150 మంది గ్రామస్థులు సేవలను వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు దూరంగా ఉన్న ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దేవేందర్ రెడ్డి సూచించారు.