హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు

AKP: నక్కపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరైనట్లు టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంమంత్రి వంగలపూడి అనిత కృషితో నిధులు మంజూరయ్యాయన్నారు. సింథటిక్ హాకీ కోర్టు చుట్టూ చైన్‌ ఫెన్సింగ్, ఫ్లడ్‌లైట్లు, కొత్త టాయిలెట్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.