హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశ్వకర్మ భగవాన్‌కు ఘన నివాళి

TPT: విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ భగవాన్‌ను సృష్టికి ఆద్యుడిగా, శిల్పకళకు ఆచార్యుడిగా భావిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.