హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ మరోసారి నియమితులయ్యారు. మరో ఐదేళ్ల కాలానికి ఆయనను టాటా సన్స్ బోర్డు పునర్‌నియమించింది. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తను మూడో విడత పదవిని కోరుకోవట్లేదని ఆగస్టు 12న చంద్రశేఖరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజా బోర్డు పరిణామాలతో ఆయన కొనసాగింపు ఖాయమైంది.