ASR: జీకేవీధి మండలం ఏబులంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. వరి సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని ఏవో సురేష్ రైతులకు సూచించారు. పొలాన్ని తరచూ పరిశీలించాలన్నారు. ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడు మాత్రమే పురుగుమందులు వాడాలన్నారు. మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడొద్దని, ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలు, కాంతి దీపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడులు'


