కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న ఐదుగురు బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రూ. 1.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వైఎస్ఆర్ నగర్‌కు చెందిన గంధం అబ్బులకు రూ. 30 వేలు, దుర్గాప్రసాద్‌కు రూ. 15 వేలు అందించారు. ఉట్రుమిల్లి గ్రామానికి చెందిన వేమగిరి జ్యోతి కుటుంబానికి రూ. 25 వేలు, ఉండ్రాచలపు రమేష్‌కు రూ. 30 వేలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న మంత్రి


