హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు: డీఎస్పీ

BDK: మణుగూరు గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. కొండాయిగూడెం గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద నిమజ్జన ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు. సింగరేణి, మున్సిపాలిటీ, విద్యుత్‌, పంచాయతీ అధికారులు, జాలర్లతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.