హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల వద్ద జాగ్రత్త వహించాలి: సీఐ

SRD: కంగ్టి సర్కిల్ పరిధిలోని సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలాల్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా చెరువుల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ వెంకట్ రెడ్డి సూచించారు. పటాన్‌చెరులో పిల్లలు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఊరేగింపులో కరెంటు తీగలను సరిచూసుకోవాలని, డీజేల వినియోగం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు.