కర్నూలు అబ్బాస్‌నగర్‌లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో 'యువత భవితకు భరోసా' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు విద్యార్థులతో మాట్లాడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, ప్రిన్సిపల్ జ్యోతి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఎంపీ


