హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

AKP: నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో వీబీజీ రామ్‌జీ పథకం కింద రూ.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి చెరువు ఆధునికరణ పనులకు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ గురువారం శంకుస్థాపన చేశారు. చెరువు గట్లును పటిష్టం చేయడం, రాయితో రివిట్‌మెంట్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు ఆట పరికరాలు, యువతకు వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు.