కృష్ణా: చందాపురం గ్రామంలో రూ.14 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రం కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం, భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన


