హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఇద్దరు అధికారుల సస్పెండ్..!

NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో అనధికార లేఅవుట్‌ల వ్యవహారంలో నగర పాలక సంస్థ (వీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారి విద్యాలత ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ లేఅవుట్లలో అధికారుల పాత్రపై ప్రాథమిక విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సస్పెన్షన్ చేసినట్లు వెల్లడించారు.