MDK: తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినందుకు గాను నిజాంపెట్ మండలం నగరం తండాలో బీఆర్ఎస్ నేతలు గురువారం మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర సాధనతో పాటు తొమ్మిదేళ్ల పాలనలో నిరుపేదల సంక్షేమానికి కేసీఆర్ విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆ తండా అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


