హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మతాలకు అతీతంగా వినాయక నిమజ్జనం

CTR: వీ.కోట పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 25 విగ్రహాలను డీజే వాయిద్యాలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తులకు నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి సోదరభావాన్ని చాటుకున్నారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన సీఐ సోమశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.