హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కొత్త టెండర్లు వెంటనే పిలవాలని అన్నారు. కార్మికులకు పెన్షన్, ఇన్సూరెన్స్, రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, పనిభారం తగ్గించాలని కోరారు.