హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎర్రకుంటలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎర్రకుంటలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఎస్సై ఉపేంద్రచారి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎం.రాజు పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా క్రేన్, వీధి దీపాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. యువజన సంఘాలు, భక్తులు సహకరించాలని కోరారు.