హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె మండలం కైపలోని గణేశ్ ఘాట్‌ను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు నిమజ్జనం పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి సూచించారు.