హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి దేవస్థానం

TPT: కాణిపాకం స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ, ఛైర్మన్‌లను ఆహ్వానించి పట్టు వస్త్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి, విజయమ్మ, హైమావతి, ఏఈఓ మోహన్ పాల్గొన్నారు.