ASR: పాడేరు కలెక్టరేట్‌లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ నిశాంతి, అధికారులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వాస్తు శిల్పం, నిర్మాణ రంగాలకు విశ్వకర్మ అందించిన సేవలు స్మరించుకోవాలని కలెక్టర్ అన్నారు. సంప్రదాయ వృత్తి నైపుణ్యాలను కాపాడుకుంటూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి


