ASR: మంప పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగుపై డ్రోన్‌తో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అన్నవరం, గొర్లిమెట్ట, కిన్నెర్లబంధ, గరిమండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎక్కడా గంజాయి సాగు ఆనవాళ్లు గుర్తించలేదన్నారు. ఆయా గ్రామాల రైతులు గంజాయి బదులు కాఫీ, మిరియాలు, మొక్కజొన్న, చిలగడదుంప తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్‌తో గంజాయి సాగుపై ఏరియల్ సర్వే


